సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేశారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది అని జాతీయ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ అజయ్ సింగ్ యాదవ్ అన్నారు. కులగణన సిటీ స్కాన్ లాంటిది. 46 శాతం బీసీ లకు 10 శాతం ews కు లోకల్ బాడీ ఎన్నికల్లో అమలు చేస్తోంది. కులగణన వలన వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఇది గేమ్ ఛేంజర్ లాంటిది. దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా కులగణన చేయాలి. బీజేపీ రాజ్యంగం మీద దాడి చేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం మీద దాడి చేస్తుంటే.. రాహుల్ గాంధీ ఒక్కడే ప్రతి పక్ష నేతగా బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తుండు. మోడీ ,అమిత్ షా లో ఈడీ,సిబిఐలతో కాంగ్రెస్ నేతపై లతో దాడి చేస్తున్నారు. మహారాష్ట్ర,హరియాన ఎన్నికల్లో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్లు ముద్దు అనేది కాంగ్రెస్ నినాదం. ఓబీసీ విద్యార్థులు ఎలాంటి స్కాలర్ షిప్ లు,నీట్ లో సీట్లు పొందలేక పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం క్రిమిలేయర్ ను ఎత్తి వేయాలి. కాంగ్రెస్ ముస్లిం పార్టీ కాదు అని అజయ్ సింగ్ పేర్కొన్నారు.