అమెరికా న్యూస్ మ్యాగజీన్ టైమ్స్, ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన 100 మంది వర్థమాన నాయకులతో ఓ జాబితా రూపొందించింది. ఈ జాబితాలో భారతదేశం నుంచి ఒకే ఒక వ్యక్తి స్థానం సంపాదించారు. ఆయనే రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ (30).
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడైన ఆకాశ్ అంబానీని జియో ఛైర్మన్గా ఈ ఏడాది జూన్లో నియమించిన సంగతి విదితమే. 22 ఏళ్లకే ఆయన కంపెనీ బోర్డులో చేరి, ఇప్పుడు పూర్తిస్థాయిలో సంస్థను నిర్వహిస్తున్నారు. వ్యాపారం, వినోదం, క్రీడలు, రాజకీయాలు, ఆరోగ్యం, సైన్స్, సమాజసేవలో ఉన్న 100 మంది వర్థమాన నాయకులను టైమ్స్ ఈ జాబితాలో చేర్చింది. భారత సంతతికి చెందిన అమెరికన్ ఓన్లీఫ్యాన్స్ అధిపతి ఆమ్రపాలి గన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.