ఉద‌య్ కిర‌ణ్ కు నేనే పోటీ…హీరో ఆకాష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

-

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో ఆకాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆనందం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో హీరో ఆకాష్ కు కూడా టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆనందం సినిమా తర్వాత ఆకాష్ చేసిన సినిమాలు టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాయి.

హీరో ఆకాష్ తమిళ్ ఇండస్ట్రీ లో కూడా కొన్ని సినిమాలలో నటించాడు. అయితే తాజాగా ఆకాష్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఆనందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నాకు రెండవ హీరోగా అవకాశం వచ్చింది. ఉదయ్ కిరణ్ మూవీ లో తనను సెకండ్ హీరోగా అడిగారని తాను హీరోగా చేయకూడదు అనే అలా అడిగారని చెప్పారు. ఇండస్ట్రీలోకి నేరుగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో కావాలనే అలా చేశారు అని హీరో ఆకాశ్ అన్నారు.

ఏ ఫిల్మ్ బై అరవింద్ మూవీ అవకాశం నాకే వస్తుంది కానీ తమిళ్ ఇండస్ట్రీ లో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా చేయలేకపోయాను. తాను వెంకటేష్ పక్కన నమో వెంకటేశా , వసంతం సినిమాలో నటించాను, కానీ నేను ఇండస్ట్రీలోకి హీరో అవ్వాలని వచ్చాను. ఆ తర్వాత ఇంట్రెస్ట్ లేక సైడ్ క్యారెక్టర్ వచ్చిన సినిమాలు చేయలేదు అని హీరో ఆకాష్ తెలియజేశాడు. ఇలా హీరో ఆకాష్ తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version