అసెంబ్లీలో అప్పుల గురించి చర్చ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతుండగా.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అంశం పై చర్చ చేపడుతున్నారని సమాచారం ఇవ్వాలి. సభను నడిపే విధానం ఇది కాదు.. ప్రాధాన్యత అంశాలను ప్రభుత్వం చర్చకు తీసుకుంటుంది. ఆర్థిక చర్చ పై అక్బరుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
సభ ఎన్ని రోజులు నడుపుతారో ఇంకా తెలియదు. పార్లమెంట్ లో సైతం సభలో చర్చించాల్సిన అంశాల గురించి ముందే చెబుతారు. మీరు ఏ అంశం పై చేపడుతున్నారో తెలియదని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు తన మద్దతు తెలుపుతున్నానని వెల్లడించారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ముందుగా ఏ అంశం పై చర్చిస్తున్నారో సమాచారం ఇవ్వాలని కోరారు. ఆ తరువాత మంత్రి శ్రీధర్ బాబు వారికి సమాధానం చెప్పారు. అప్పులపై చర్చ మీరు వద్దంటే ఆపేస్తారు. స్పీకర్ సారి చెప్పాలని కొందరూ డిమాండ్ చేస్తే.. మంత్రి శ్రీధర్ బాబు గట్టిగా అరిచారు. అసెంబ్లీలో కాస్త ఉద్రికత్త వాతావరణం నెలకొంది. మళ్లీ సద్దు మణిగి చర్చ ప్రారంభం అయింది. అలాగే ముందు ముందు సమాచారం లోపం లేకుండా చూడండి అని స్పీకర్ ను కోరారు అక్బరుద్దీన్ ఒవైసీ.