దాంపత్య సమస్యల పరిష్కారం కోసం అక్కినేని సమంత పూజలు !

-

తిరుపతి : అక్కినేని సమంత ప్రస్తుతం శ్రీకాళహస్తి ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా రెండు రోజూ శ్రీకాళహస్తి ఆలయం లో హీరోయిన్ సమంత పూజలు చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుండి శ్రీకాళహస్తి దేవస్థానం లో వరుస పూజలు నిర్వహిస్తున్నారు అక్కినేని సమంత. నిన్న మహా న్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు సమంత.

నర దోషం, గ్రహ దోషం, శత్రు శేషం, దాంపత్య సమస్యలు, ఎదుగుదల నర దిష్టి రుద్ర హోమం, చండి హోమం నిర్వహిస్తోన్నారు అక్కినేని సమంత. ముఖ్యంగా దాంపత్య సమస్య పరిష్కారం కోసం.. శ్రీకాళహస్తి దేవస్థానం లో వరుస పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం… కాగా గత కొన్ని నెలలుగా అక్కినేని సమంత మరియు అక్కినేని నాగ చైతన్య మధ్య వివాదాలు చెలరేగిన వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు వీరు త్వరలోనే విడాకులు తీసుకుంటానని.. జోరుగా చర్చ కూడా సాగింది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి దేవస్థానం లో సమంత వరుస పూజలు నిర్వహించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version