వచ్చే ఏడాది జనవరిలో ఉత్తరప్రదేశ్‌లో మహా కుంభమేళా ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో ముగిసే ఈ మహాకుంభ మేళా ఏర్పాట్లపై యోగి సర్కార్ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే సీఎం యోగి ఆదిత్యనాథ్ 13 అఖాడాలు, ఖాక్ చౌక్, దాండి బారా, ఆచార్య బారాలతో భేటీ అయ్యారు. సనాతన సమాజ మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మహాకుంభ మేళా పరిసర ప్రాంతాల్లో మాంసం, మద్యం క్రయ విక్రయాలపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎంఓ ఒక ప్రకటన విడుదల చేసింది.మాంసం భుజించడం, మద్యపానం సేవించడాన్ని కూడా నిషేధిస్తున్నట్లు తెలిపారు.
మహాకుంభమేళా కోసం నదులను పరిశుభ్రం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఇందుకు సాధువుల సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు.మహాకుంభ మేళా సమయంలో విముక్తి పొందిన సాధువులకు ప్రయాగ్‌రాజ్‌లోనే సమాధుల కోసం స్థలాన్ని కేటాయిస్తామన్నారు.ప్రాణాలు వదిలిన సాధువులను సంపూర్ణంగా పరిశీలించే వరకూ తమ ఆశ్రమాల్లోకి ఎవరికీ రిజర్వ్ చేయరాదని విజ్ఞప్తి చేశారు.