‘ఆల్కహాల్’ టీజర్ రిలీజ్..అల్లరి నరేష్ ఫ్యాన్స్ కు ఇక జాత‌రే

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ హీరోగా పేరుగాంచిన వారిలో అల్లరి నరేష్ ముందు వరుసలో ఉంటారు. అప్పట్లో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్… కమెడియన్ హీరోగా కొనసాగగా ఆ తర్వాత ఆ స్థానాన్ని అల్లరి నరేష్ భర్తీ చేశారు. ఇందులో భాగంగానే వరుసగా కామెడీ సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అల్లరి నరేష్.

alcohol
alcohol

అయితే ఇలాంటి నేపథ్యంలో సరికొత్త మూవీ తో అల్లరి నరేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆల్కహాల్.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో అల్లరి నరేష్, కమెడియన్ సత్య, గృహాని శర్మ అలాగే నిహారిక కీలక పాత్రలో కనిపించనున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ కూడా రిలీజ్ చేశారు. మందే అలవాటు లేని నరేష్.. ఆ మందుకు బానిస అయితే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్ గా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా… మెహర్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లరి నరేష్ నటించిన ఈ ఆల్కహాల్ సినిమా జనవరి 2026 ఒకటవ తేదీన రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news