మన దేశ ఆర్థిక వ్యవస్థలో నాణెం ఒక కీలకమైన పాత్ర పోషిస్తాయి. నిత్యజీవితంలో మనం తరచుగా ఉపయోగించే ఒక రూపాయి నాణెం ముద్రణకు ఎంత ఖర్చవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దాని ముఖ విలువ మించి దాని తయారీ ఖర్చు అవుతుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలగక మానదు. కరెన్సీ నోట్ల మాదిరిగా కాకుండా నాణేల ముద్రణకు అయ్యే ఖర్చు వాటి మన్నిక చాలా భిన్నంగా ఉంటాయి. ఒక రూపాయి నాణెం ముద్రణకు నిజంగా ఎంత ఖర్చవుతుందో దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా కరెన్సీ నోట్ల కంటే నాణాల ముద్రత తక్కువ ఖర్చు అవుతుంది. ముఖ్యంగా ఒక రూపాయి నాణెం ముద్రణకు అయ్యే ఖర్చు దాని ముఖ విలువ దాదాపు సమానంగా ఉంటుంది. భారత ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారం ఒక రూపాయి ముద్రణకు సుమారురూ.1.11 ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులో లోహం డిజైను ముద్రణ ప్రక్రియ రవాణా వంటి వ్యయాలు ఉంటాయి. పదేపదే ముద్రించాల్సిన అవసరం లేకపోవడం వల్ల నాణేలు ఎక్కువకాలం చలామణిలో ఉంటాయి. ఇది ప్రభుత్వానికి కొంతవరకు వ్యయాన్ని తగ్గిస్తుంది.

ప్రస్తుతం చలామణిలో ఉన్న ఒక రూపాయి నాణ్యాలు ఫెర్రిటిక్ స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేయబడతాయి. ఈ లోహం తుప్పు పట్టదు, చాలా గట్టిగా ఉంటుంది. అంతేకాక నోట్లతో పోలిస్తే నాణేలు చాలా మన్నిక అయినవి. అవి దెబ్బ తినడం చిరగడం, తడిచిపోవడం వంటి సమస్యలు ఉండవు. నాణేల ముద్రణ ప్రక్రియను మీటింగ్ అని అంటారు. ఇది కరెన్సీ నోట్ల ముద్రణ ప్రక్రియ కంటే భిన్నంగా ఉంటుంది.
ఒక రూపాయి నాణెం ముద్రించడానికి దాని విలువ కంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ నాణెం ఫెర్రిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేయబడతాయి. అందువల్ల అవి మన్నికగా ఉండి ఎక్కువ కాలం చలామణిలో ఉంటాయి.