ఏపీ రైతులకు శుభవార్త…పొగాకు కొనుగోలుపై కీలక ప్రకటన చేసింది ఏపీ సర్కార్. నెలాఖరు వరకు పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ నెలాఖరులోగా నల్ల బర్లీ పొగాకు కొనుగోళ్లను పూర్తి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 80 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి జరిగిందని పేర్కొన్నారు.

మార్క్ ఫెడ్, ప్రైవేట్ కంపెనీలు 55 మిలియన్ల కిలోల పొగాకు కొన్నాయి. మిగిలిన పొగాకులో నెలాఖరులోగా ఐదు మిలియన్ల కిలోలు మార్క్ ఫెడ్, 20 మిలియన్ల కిలోలు ప్రైవేట్ కంపెనీలు కొనుగోలు చేయాలి. వచ్చే రబీలో ఎవరు నల్ల బర్లీ పొగాకు పండించకూడదని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఇదిలా ఉండగా…. ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. అమరావతి అలాగే రైతుల సమస్యలను గురించి సమావేశాలలో చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.