ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్…! ఈ అంశాల్లో మార్పులు…!

-

ఆంధ్రా బ్యాంక్ ఖాతాదారుల కోసం ముఖమైన సమాచారం. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకుల్లో అకౌంట్ కలిగిన వారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వీటిని తెలుసుకుంటే ఎటువంటి ఇబ్బందులని పడక్కర్లేదు. మరి ఈ విషయాల కోసం ఇప్పుడే తెలుసుకోండి. ఇక వివరాల లోకి వెళ్తే… ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైన విషయం తెలిసిందే. యూనియన్ బ్యాంక్ ఇటీవల తన ఐటీ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేసింది.

ఇది ఇలా ఉండగా ఐఎఫ్ఎస్‌సీ, ఎంఐసీఆర్ కోడ్లు మారుతాయి గమనించాల్సి ఉంది. కానీ ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ కస్టమర్ల అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడెంటిఫికేషన్ నెంబర్లలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. ఇక ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఐసీఆర్ కోడ్ల ద్వారా నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఈసీఎస్, న్యాక్ వంటి ట్రాన్సాక్షన్లు 2021 మార్చి 31 వరకు మాత్రమే అవుతాయి. ఆ తరువాత మాత్రం ఖచ్చితంగా కస్టమర్లు ఐఎఫ్ఎస్‌సీ, ఎంఐసీఆర్ కోడ్స్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. డెబిట్ కార్డులకు వచ్చిన నష్టం ఏమీ లేదు గుర్తుంచుకోండి. కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ కస్టమర్ల ప్రస్తుత డెబిట్ కార్డులు యధావిధిగా పని చేస్తాయి.

మీ కార్డు కనుక ఎక్స్‌పైరీ అయిపోతే అప్పుడు కొత్త కార్డులు తీసుకోవాల్సి ఉంది. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ ఫెసిలిటీల్లో మాత్రం మార్పు వస్తుంది గమనించండి. ఆంధ్రా బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కలిగిన వారు ఇక పై యూనియన్ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకోవాలి. కానీ లాగిన్ చేసుకునే వివరాలు అవే ఉంటాయి. మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించాలంటే కస్టమర్లు మత్రం యూనియన్ బ్యాంక్ మొబైల్ యాప్‌ను (యూమొబైల్) డౌన్‌లోడ్ చేసుకొని మళ్లీ డెబిట్ కార్డు సాయంతో లాగిన్ వివరాలను అప్‌డేట్ చేసి సర్వీసులని పొందొచ్చు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version