తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారం ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ, గుంటూరులో స్కిన్ లెస్ చికెన్ ధర 220 రూపాయలు ఉండగా…. ఈరోజు 240 రూపాయలకు విక్రయిస్తున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, కామారెడ్డిలో కేజీ చికెన్ ధర 240 రూపాయలుగా ఉంది. నిన్నటితో వినాయకుడి నవరాత్రులు పూర్తి కాగా ఈరోజు చాలామంది చికెన్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ రోజు ఆదివారం కావడంతో చికెన్ ధరలు తెలుగు రాష్ట్రాలలో భారీగా పెరిగాయి. చికెన్ షాప్ ల వద్ద ప్రజలు ఎగబడి మరీ చికెన్ కొనుగోలు చేస్తున్నారు. మొన్నటి వరకు శ్రావణమాసం ఉండడంతో చికెన్ ఎవరు కొనుగోలు చేయడం లేదు. శ్రావణమాసంలో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో కేవలం 180 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేశారు. ఇప్పుడు ఏకంగా శ్రావణమాసం, వినాయకుడి నిమజ్జనాలు పూర్తికావడంతో చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి.