వరంగల్ లో భారీ వర్షం పడుతోంది. దీంతో వరంగల్ లోని పలు కాలనీలు నీట మునిగాయి. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వరంగల్ లో వాన కురుస్తోంది. అటు వరంగల్ లోని చెరువులను ప్రధాన రహదారులు తలపిస్తున్నాయి.

అండర్ బ్రిడ్జ్ దగ్గర వరదల్లో రెండు ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. పలు కాలనీలు నీట మునిగాయి. ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండానే వర్షం పడటంతో… వరంగల్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. కాగా.. వరంగల్ జిల్లాలో ఇవాళ, రేపు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
వరంగల్ లో భారీ వర్షం..
తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన.
చెరువులను తలపిస్తున్న ప్రధాన రహదారులు.
అండర్ బ్రిడ్జ్ దగ్గర వరదల్లో చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సులు.
నీట మునిగిన పలు కాలనీలు. pic.twitter.com/TUFZBI6Ndg— ChotaNews App (@ChotaNewsApp) September 7, 2025