తెలుగు రాష్ట్రాలు అయినా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న మాంసాహారులకు అలర్ట్. ఇవాళ రెండు రాష్ట్రాలలో చికెన్ ధరలు స్థిరంగానే నమోదు అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో కొన్ని ప్రాంతాల్లో 200 రూపాయలకు కిలో చికెన్ అమ్ముతుండగా మరికొన్ని ప్రాంతాల్లో 220 రూపాయలు విక్రయిస్తున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ మహానగరంలో స్కిన్ లెస్ చికెన్ కేజీ 220 రూపాయలుగా నడుస్తోంది. గుంటూరు అలాగే చిత్తూరు జిల్లాలలో 200 రూపాయల చొప్పున కేజీ చికెన్ విక్రయిస్తున్నారు. కరీంనగర్ అలాగే సిరిసిల్ల, వరంగల్, ఖమ్మం లాంటి జిల్లాలో 220 రూపాయలు గానే కిలో చికెన్ విక్రయిస్తున్నారు. అయితే వినాయక చ వితి పూర్తయిన తర్వాత చికెన్ ధరలు పెరిగే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు. ఇటు కిలో మటన్ 800 నడుస్తోంది.