జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేసారు..కోమటికుంట్లలో 180 ఎకరాలు కబ్జా చేసినట్లు ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అనేక అరాచకాలు, అక్రమాలు చేశాడని షాకింగ్ కామెంట్స్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. గత ప్రభుత్వంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి కోమటికుంట్లలో 180 ఎకరాలు ఆక్రమించుకున్నాడని.. తాడిపత్రి అంటే మాకు ఒక దేవాలయం, తాడిపత్రి ప్రజలు మాకు దేవుళ్ళు అన్నారు.

తాడిపత్రికి మంచి చేశాం కాబట్టే 40 ఏళ్లుగా ప్రజలు మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారని గుర్తు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.