తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ వేడి వాడిగా జరగనున్నాయి. ఇవాళ అసెంబ్లీలో కాలేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై చర్చ జరగబోతోంది. 9 గంటల సమయంలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. ఈ నేపథ్యంలోనే చర్చ జరగనుంది. అయితే కాలేశ్వరం కమిషన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు హరీష్ రావు.

సభలో రిపోర్టు సీఎం రేవంత్ రెడ్డి పెట్టనున్న నేపథ్యంలో… గులాబీ పార్టీ ఎలా ముందుకు వెళ్తుందో చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే కల్వకుంట్ల చంద్రశేఖర రావు సభకు హాజరవుతారా? లేదా? అనేది చూడాలి. ఇక ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీకి రాకపోతే రాజీనామా చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలనం వ్యాఖ్యలు కూడా… చేసారు. అయితే ఈ రిపోర్ట్ పైన కెసిఆర్ స్థానంలో హరీష్ రావు కౌంటర్ ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి.