ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు అలర్ట్..!

-

ఈపీఎఫ్‌వో ఉద్యోగుల్ని అలెర్ట్ చేస్తోంది. ఈ మధ్య కాలం లో మోసాలు ఎక్కువైపోయాయి. ఈ విషయం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎక్కడ చూసిన మోసాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈపీఎఫ్‌వో ఉద్యోగులకి అలెర్ట్ చేస్తోంది. 6.5 కోట్ల మంది ఉద్యోగులకు సమాచారాన్ని ఇస్తోంది.

సైబర్ నేరాల గురించి సభ్యులను ఈ మేరకు అలెర్ట్ చేసారు. పీఎఫ్ ఖాతా పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయని.. వీటిని దృష్టిలో ఉంచుకుని సైబర్ నేరాల గురించి అప్రమత్తం చేయడం జరిగింది. మోసాలు చేసే వాళ్ళు ఈపీఎఫ్‌వో పేరు తో పెర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నారని.. ఇలాంటి సమయం లో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈపీఎఫ్‌వో ఉద్యోగుల పదవీ విరమణ కోసం నిధిని సేకరిస్తుంది. అయితే కంపెనీ, ఉద్యోగి ఇద్దరి తరపునా కూడా డబ్బులు జమ చేస్తారు.

ఉద్యోగుల ప్రాథమిక వేతనం నుండి 12 శాతం మొత్తం తీస్తారు. అలానే అదే మొత్తం కంపెనీ నుండి జమ చేస్తుంది. సంవత్సరానికి 8.1% వడ్డీ దీని మీద వస్తుంది. మీకు ఒకవేళ కనుక ఈపీఎఫ్‌ ​నుండి మెసేజ్ లేదా ఫోన్ వస్తే అలెర్ట్ గా ఉండాలి. ఆధార్ కార్డ్, పాన్ నంబర్, యూఏఎన్‌, పాస్‌ వర్డ్ వంటి వివరాలని ఇవ్వొద్దు. ఓటీపీ, ఆధార్‌, యూఏఎన్‌ నెంబర్లను కూడా ఎవరైనా ఫోన్ చేసి అడిగితే చెప్పకూడదు చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version