తెలంగాణ ప్రజలకు అలర్ట్.. అక్షరం మారినా ఇందిరమ్మ ఇల్లు బిల్లు కాన్సిల్ అవుతుందని అంటున్నారు.
ఆధార్ కార్డులో ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రంలో లబ్ధిదారుడి పేరులో ఒక్క అక్షరం తేడా ఉన్నా బిల్లు రద్దు చేస్తున్నారట అధికారులు. ఆధార్ కార్డులో పుట్టింటి ఇంటిపేరు ఉండి ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రంలో అత్తింటి ఇంటిపేరు ఉన్నా బిల్లు రద్దు చేస్తున్నారని వాపోతున్నారు మహిళా లబ్ధిదారులు.

వల్లి అనే మహిళ పేరు ఆధార్ కార్డులో “vally” అని ఉండగా, ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రంలో “Valli” అని ఉండడం, స్వాతి పేరు “Swathi” అని ఆధార్ కార్డులో “Swati” అని మంజూరు పత్రంలో ఉండడంతో బిల్లు రద్దు చేశారట అధికారులు. నల్గొండ జిల్లాకు చెందిన ఒక మహిళా పేరు ఆధార్ కార్డులో పెద్దబోయిన ఈశ్వరమ్మ, ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రంలో పి.ఈశ్వరమ్మ అని ఉండడంతో రద్దయిందట ఇందిరమ్మ ఇల్లు బిల్లు.