ఏపీలో కరెంట్ చార్జీల పెంపు అంశం అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల అగ్గి రాజేసింది. మొన్నటివరకు తమను కరెంటు చార్జీల పెంపు విషయంలో నిలదీసిన కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఇప్పుడు విద్యుత్ చార్జీలను ఏ విధంగా పెంచారని, ప్రజలపై ఎలా భారం మోపారని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు వైసీపీ అధినేత జగన్ పిలుపుతో నిన్న రాస్తారోకోలు, నిరసనలు చేపట్టారు.
తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కరెంటు చార్జీల పెంపు అంశంలో ప్రశ్నల వర్షం కురిపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలవుతున్నా ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు లభించలేదని,ఎలక్షన్ సమయంలో బాదుడే బాదుడు అంటూ ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని కేతిరెడ్డి నిలదీశారు.