కిమ్‌ జాంగ్‌ ఉన్‌.. రూటే సెపరేటు.. భార్యను కూడా నమ్మడు…!

-

కిమ్ జాంగ్ ఉన్… బహుషా ప్రపంచంలో ఈ పేరు తెలియను వారు ఉండరు ఏమో…? వార్తలు చూసే అలవాటు ఉండి… అంటే 9 గంటలకు ఈటీవీ వార్తలు చూసి పడుకునే వాళ్లకు, పొద్దున్నే లేచి ఏదోక పేపర్ చదివే వాళ్లకు, సోషల్ మీడియా అప్పుడప్పుడు అయినా వాడే వాళ్లకు కూడా బాబు గురించి అవగాహన ఉంటుంది. తనను అందరూ నియంత అని అంటే అదో పెద్ద అవార్డులా ఫీలయ్యే మనిషి.. తన పిల్లలను కూడా దగ్గరకు రానివ్వడు.. అమ్మాయిల మీద మోజు ఎక్కువ.. అతని తిండి కోసం, విలాసాల కోసం ప్రత్యేక బడ్జెట్.. అతని హెయిర్ స్టైల్ మగాళ్ళు, అతని భార్య హెయిర్ స్టైల్ ఆడాళ్ళు ఫాలో అవ్వాలి. ఇది కిమ్‌ గురించి బ్రీఫ్‌గా..

కిమ్‌ జగ మొండి

దక్షిణ కొరియా, ఉత్తర కొరియా సరిహద్దుల్లో సైనిక కవాతు చేసి… సరిహద్దుకి అతి దగ్గరగా అణు బాంబులు ప్రయోగించినా.. జపాన్‌పై మిస్సైల్ ప్రయోగిస్తా౦ అని బెదిరింపులకు దిగినా ఆ ఘనత కిమ్‌కే దక్కుతుంది..

చైనా సరిహద్దున ఉన్న గ్రామాలకు పది కిలోమీటర్ల దూరంలో అణు ప్రయోగం చేస్తే, చైనాలో భూమి కంపించి రిక్టర్ స్కేల్ మీద 4.8 గా నమోదైంది.. అయినా కిమ్‌ని మాత్రం చైనా కూడా వద్దనలేకపోయింది. ఒబామా తొలిసారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి అమెరికా ప్రయత్నాలు చేస్తున్నా అతను మాత్రం ఆగలేదు. ఎన్ని ఆంక్షలు విధించినా ప్రయోగాలకు అవసరం అయ్యే డీజిల్, ఆయిల్ ఉత్పత్తులను ఆపేసినా సరే అతను మారలేదు. దేశం చిన్నది అయిపోయింది గాని అదే పెద్ద దేశం అయి ఉంటే బాబు అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేసే వాడు. అమెరికాను కూడా ఖాతరు చెయ్యని నైజం కిమ్‌ది. సింగపూర్ లో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే, నాకు ఇంగ్లీష్ రాదు కొరియానే వచ్చు అని ట్రంప్ కి పేపర్ మీద కొరియాలో రాసి ఇస్తే అమెరికన్ ట్రాన్స్లెటర్ దాన్ని చదివితే అతని మీద విచారణ చేయించిన రకం కిమ్.

తండ్రి చనిపోయిన తర్వాత 2008లో బాబు ఆ దేశానికి వారసత్వంగా అధ్యక్షుడు అయ్యాడు. ఎప్పుడు పుట్టాడో ఈ ప్రపంచానికి తెలియదు. కిమ్‌ పుట్టింది 1982లో అని అధికారికంగా ప్రకటించినా,

దక్షిణ కొరియా రికార్డుల ప్రకారం 1983 అని, అమెరికా ప్రకారం 1984 నమోదు చేసి ఉంది. అధికారం చేపట్టడం కోసం సంవత్సరాన్ని కూడా తగ్గించాడు అంటారు. కిమ్‌ పేరు కూడా ఒక సీక్రెటే.. ఆయన పేరు బయటకు తెలియకుండా మారు పేరుతో చదివించారు. స్విజ్జర్లాండ్‌లో చదివే రోజుల్లో ఆయన పేరు “పాక్‌-కోల్‌” అని, తరువాత చదివిన స్కూల్‌లో “పాక్‌-ఉన్‌” గా రిజిస్టర్‌ చేయించారు. ఎక్కడ కూడా కిమ్‌ ఉనికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడేవారు.

క్రూరత్వానికి మారు పేరు..

అతని మాట వినకపోతే ఎవరిని అయినా చంపేసే రకం. నాలుగేళ్ల క్రితం ఒక వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాడు కిమ్. అక్కడ తాబేళ్లు పెంచుతూ ఉంటారు.చైనాలో తాబేళ్ళకు డిమాండ్‌ చాలా.. ఆదాయం కూడా ఎక్కువ. అయితే అక్కడ చనిపోయిన మూడు తాబేళ్ళని చూసిన కిమ్‌.. వాటిని సరిగా చూసుకోవడం లేదని, తాబేళ్లను పెంచే వ్యక్తిని పిలిచి చంపేసాడంటే కిమ్‌ ఎంత క్రూరుడో అర్థమవుతుంది. ఎబోలా దేశంలో ఎవరికి అయినా వస్తే అదే ఎబోలాను శరీరంలోకి ఎక్కించి చంపేస్తా అని అధికారులను హెచ్చరించాడు. దెబ్బకు కొరియా వెళ్ళడమే మానేశాయి ఆఫ్రికా దేశాలు.

ఆ తర్వాత కరోనా విషయంలో కూడా ఇదే చేసాడు.

నియంత.. స్త్రీ లోలుడు

విదేశాల నుంచి ఆ దేశంలోకి వచ్చే ప్రతీ ఒక్కరికి కూడా మానసిక పరీక్షలు చేయిస్తాడు, ఎవరు ఎలాంటి వారో ప్రశ్నలు వేసిన తర్వాతే విమానాశ్రయం నుంచి బయటకు పంపిస్తారు. దేశం నుంచి వెళ్ళే సమయంలో తీసిన ఫోటోలు చూపించి వెళ్ళాలి, ఎక్కడ ఉన్నారు ఏం చేసారు అనేది కూడా చెప్పే వెళ్ళాలి.

అతని మాట శాసనం, అతని ఆలోచన చట్టం, అతన్ని కలిసే సైనిక అధికారులకు పరీక్షలు తప్పనిసరి. ఒక్క సోదరి కిమ్ యో జోంగ్ కి మాత్రం అలా ఉండదు. అతను తాగే సిగరెట్ లు, తాగే మద్యం, వాడే బట్టలు అన్నీ కూడా నెలకు ఒకసారి విదేశాల నుంచి తీసుకుని వస్తారు. బాగా విలాస పురుషుడు. అమ్మాయిల మీద మోజు ఎక్కువ. అతను అనుభవించిన స్త్రీని ఎవరు అనుభవించకూడదని చంపేసాడు అంటారు.

పెళ్ళికి ముందు భార్యకు ప్రేమ కథ ఉందని తెలిసి విచారణ చేయించి లేదు అని తెలిసిన తర్వాతే ఆమెను పెళ్లి చేసుకున్నాడు అంటారు. పిల్లలు అంటే అతనికి ప్రేమ ఉండదు. ఎవరిని కూడా దగ్గరకి తీసుకుని మాట్లాడే రకం కాదు. గంభీరం గా కనపడటం అతనికి చాలా ఇష్టం. అదే సమయంలో అతనికి తిండి మీద చాలా ప్రేమ. అతని తిండి కోసం, విలాసాల కోసం ప్రత్యేక బడ్జెట్ ఉంటుంది. మన దేశం మాదిరి, లేదా ఇతర ప్రపంచ దేశాల మాదిరి అక్కడ ఏ క్యాలెండర్ ఉండదు. ఆ దేశం క్యాలెండర్ ఫాలో అవ్వాలి. అతని హెయిర్ స్టైల్ మగాళ్ళు, అతని భార్య హెయిర్ స్టైల్ ఆడాళ్ళు ఫాలో అవ్వాలి. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ దేశ అధికారులు సమాచారం ఇవ్వాలి.

తన పదవికి ఎక్కడ అడ్డు వస్తాడో అని భావించి రెండేళ్ళ క్రితం మలేషియా విమానాశ్రయంలో అతని అన్నను చంపించాడంటారు. అతని కార్ లో ముగ్గురు మాత్రమే అనుమతి ఉంటుంది. డ్రైవర్ మినహా… ఆ ముగ్గురిలో అతని సోదరి, ఆ దేశ సైనిక అధ్యక్షుడు… భార్య అయినా సరే వేరే కార్ లో రావాల్సిందే.

తన తండ్రి, తాతలా కనిపించడానికి ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకున్న ఘనుడు మన కిమ్‌ జాంగ్‌ ఉన్‌.. ఉత్తర కొరియా పరిస్థితి అయోమయంలో ఉంది. ఆ దేశ అధిపతి కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఆరోగ్యం బాగోలేదని కొన్ని మీడియా సంస్థలు చెబుతుంటే..
హాంగ్ కాంగ్, జపాన్ మీడియా సంస్థలు ఆయన మరణించారని ఆధారాలతో సహా వివరిస్తున్నాయి.. ఇక కిమ్ జాంగ్ ఉన్‌ తరువాత ఉత్తర కొరియాను పాలించేది ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్‌ అని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version