Breaking : కేసీఆర్‌ సభకు సర్వం సిద్ధం.. ఎల్లుండే భారీ బహిరంగ సభ

-

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్టోబర్‌ 30న చండూరు మండలం బంగారు గడ్డలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మునుగోడు ఓటర్లను సీఎం కోరనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సభా ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం బహిరంగసభ ఇన్‌చార్జి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లుతో కలిసి మంత్రి ఎర్రబెల్లి సభా ప్రాంగణం అంతా తిరిగి చూశారు. ఈ సందర్భంగా మంత్రి వెంబడి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవ, సీనియర్ నాయకులు కిషన్ రావు తదితర టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు మద్దతుగా చండూరు మున్సిపాలిటీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మతతత్వ పార్టీ అని, ప్రజల మధ్య చిచ్చుపెట్టి విచ్ఛిన్నం చేయడమే ఆ పార్టీ విధానమని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ఈ బైక్‌ ర్యాలీలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ రవీందర్ రావు, వరంగల్ కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version