రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారు : ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి. చండూరు మండలం ఇడికూడ కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కాంగ్రెస్ మేనిఫెస్టోను మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తో కలిసి జీవన్ రెడ్డి విడుదల చేశారు. జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కుల వృత్తుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఆయన ఆరోపించారు జీవన్ రెడ్డి. గీత కార్మికులను కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముదిరాజ్ లను బీసీ ఏ లో చేర్చాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. మూడున్నరేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలకు చేసిందేమీ లేదని చెప్పారు జీవన్ రెడ్డి.

ఓ ఎమ్మెల్యేగా ఆయన ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో లేరని జీవన్ రెడ్డి ఆరోపించారు. భూ నిర్వాసితుల విషయంలో రాజగోపాల్ రెడ్డి ఏమాత్రం శ్రద్ధ చూపలేదని ఫైర్ అయ్యారు. ఆయన ధన దాహం వల్లే మునుగోడు బై పోల్ వచ్చిందని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా తీర్పు నివ్వాలని జీవన్ రెడ్డి కోరారు. ప్రలజకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే పాల్వాయి స్రవంతిని గెలిపించాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version