“ఆదిపురుష్” మేకర్స్ పై FIR నమొదు చెయ్యాలి…

-

ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ మూవీ వరుసగా వివాదాలను ఎదుర్కొంటోంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆదిపురుష్ సినిమాను నిర్మించిన మేకర్స్ పైన FIR ను నమోదు చేయాలని అల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ముంబై పోలీస్ ను మరియు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కోరడం జరిగింది. ఈ కంప్లైంట్ లో ఆదిపురుష్ సినీ నిర్మాత భూషణ్ కుమార్, డైరెక్టర్ ఓం రౌత్, రచయిత మనోజ్ ముంతాషీర్ పై కేసును నమోదు చేయాలని కోరారు. హింధుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా సినిమాను చిత్రీకరించినందుకు వీరిపై తగు చర్యలు తీసుకోవాలని వీరు లేఖను రాశారు.

ఆదిపురుష్ లోని దుస్తులు, సీన్స్ , డైలాగ్స్ హిందువులు అనాదిగా నమ్ముకుంటున్న కొన్ని పద్దతులను కాలరాసే విధంగా ఉన్నాయంటూ వీరు ఆవేదనను వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version