ఈనెల 31వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి ఒకటవ తేదీన పార్లమెంటులో సార్వత్రిక బడ్జెట్ 2023లో ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల సందర్భంగా ఉభయసభల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులు, చేయబోయే చట్టాలు తదితర అంశాలపై ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉంది.
ఈ మేరకు అన్ని పార్టీలకు కేంద్రం ఆహ్వానం పంపన ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు తొలి విడుద, మార్చి 6 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండవ విడత సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంటులో నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే బిజెపి ప్రభుత్వానికి 2024 సార్వత్రిక ఎన్నికలలోపు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కానుండడంతో ఈసారి బడ్జెట్ పై అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.