దేశ రాజధాని ఢిల్లీ పార్లమెంట్ భవనం లో ఆల్ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అప్ఘాన్ లోని పరిస్థితుల పై అఖిల పక్ష నేతలకు విదేశాంగ మంత్రి జయ శంకర్ వివరిస్తున్నారు. అటు ఇప్పటికే ఆగస్ట్ 31 లోగా తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని తాలిబన్లు డెడ్ లైన్ విధించారు. ఈ నేపథ్యం లో నే ఆల్ పార్టీ సమావేశం నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం.
ఉదయం 12 గంటల ప్రాంతం లో ప్రారంభమైన ఈ ఆల్ పార్టీ మీటింగ్ లో టీఆర్ఎస్ పార్టీ తరపున లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు సమావేశానికి హాజరు అయ్యారు. అటు టీడీపి తరపున సమావేశానికి ఎంపి గల్లా జయదేవ్ హజరు కాగా… వైసీపి తరపున లోక్ సభ పక్షనేత మిథున్ రెడ్డి సమావేశానికి హాజరు అయ్యారు. ఈ సమావేశంలో అఫ్గానిస్థాన్ లో తాజా పరిస్థితి, అనుసరించాల్సిన వైఖరి పై అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తమ తరపున సూచనలు చేయనున్నాయి.