వినాయక చవితికి ” నో ” హాలీ డే.. ఉద్యోగుల్లో అసంతృప్తి !

-

అమరావతి : సెప్టెంబరు 10 వ తేదీన వినాయక చవితి పండుగ రానుంది. అయితే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు సెలవు ప్రకటించక పోవడం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సెలవు పై ఏపీ ప్రభుత్వానికి యునైటెడ్ ఫోరఙ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్‌ రాంబాబు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం 10 “సెప్టెంబర్ 2021 న వినాయక చవితికి సెలవు ప్రకటించలేదని పేర్కొన్న ఆయన… మతాల అడ్డంకులు దాటి పౌరులందరూ ఈ ముఖ్యమైన పండుగను జరుపుకుంటారని తెలిపారు.

NI చట్టం కింద కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ సెలవు ఇవ్వబడిందని లేఖ లో పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పనిచేస్తున్న బ్యాంక్ ఉద్యోగులు ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని… నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ కింద సెలవు కూడా ఉందని తెలిపారు. అందువల్ల, వేలాది మంది బ్యాంక్ ఉద్యోగుల యొక్క మతపరమైన భావాలను గౌరవించి… సెప్టెంబరు 10వ తేదీన వినాయక చవితికి సెలవు ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తమ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version