రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణానికి ఏర్పాట్లు పూర్తి

-

ఎన్డీఏ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ద్రౌప‌ది ముర్ము జూలై 21న నిర్వ‌హించిన ఎన్నిక‌ల్లో భార‌త రాష్ట్ర‌ప‌తిగా విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. 15వ రాష్ట్ర‌ప‌తిగా ఆమె ఎన్నిక‌య్యారు. రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన మొద‌టి గిరిజ‌న మ‌హిళ‌గా చ‌రిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ద్రౌపది ముర్ము నిలిచారు. ఈ నెల 25న రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌మాణం చేయ‌నున్నారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో ఉదయం 10.15 గంటలకు ముర్ము చేత సీజేఐ జస్టిస్‌ రమణ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం సైనికులు 21గన్‌ సెల్యూట్‌ సమర్పి్స్తారు. తర్వాత రాష్ట్రపతి హోదాలో తొలిసారు ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. అంతకుముందు ప్రస్తుత రాష్ట్రపతి కోవింద్‌తో కలిసి ఆమె పార్లమెంటుకు ఊరేగింపుగా వస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఉన్నతాధికారులు పూర్తి చేశారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన ద్రౌప‌ది ముర్ముకు దేశ న‌లుమూల‌ల‌నుంచి అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.

v

కాగా, అమూల్ భారతీయ సహకార డైరీ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు సాద‌ర స్వాగ‌తం ప‌లికేందుకు ప్ర‌త్యేక డూడుల్‌ను రూపొందించింది. దీన్ని ఇన్‌స్టాగ్రాంలో అమూల్ ఇండియా షేర్ చేసింది. ‘స్వాగ‌తం..మేడం ప్రెసిడెంట్’ అనే క్యాప్ష‌న్ ఇచ్చింది. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌నం ఎదుట ద్రౌప‌ది ముర్ము భార‌తీయ సంస్కృతి ప్ర‌కారం వంద‌నం చేస్తున్న‌ట్లు డూడుల్ ఉంది. ఈ డూడుల్ పైన‌ ‘ముర్‌మ‌ధ‌ర్‌’ ఇండియా అని రాసి ఉంది. కింద ‘అమూల్‌..టాప్ పొజిష‌న్ ఇన్ బ‌ట‌ర్స్’ అని రాశారు. ఈ డూడుల్ నెటిజ‌న్ల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న‌ది. కొత్త రాష్ట్ర‌ప‌తికి చాలా సృజ‌నాత్మ‌కంగా వెల్‌క‌మ్ చెప్పారంటూ అమూల్ ఇండియాపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version