తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడారు.ముందుగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన.. ఆనాడు తెలుగు ప్రజలు, ఆంధ్ర రాష్ట్రం కోసం మహనీయుడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీనే టీడీపీ అని గుర్తుచేశారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిందని.. అది అషామాషీ విషయం కాదన్నారు.
తనకు అప్లికేషన్లు పెట్టుకుంటే పదవులు రావని, క్షేత్ర స్థాయిలో పనిచేసిన వాళ్లకు ఆటోమెటిక్‌గా పదవులు వస్తాయన్నారు. ఎవరు సిఫార్సు చేసినా తాను పదవులు ఇవ్వబోనని, పనితీరు ఆధారంగానే సముచిత గౌరవం దక్కుతుందన్నారు. తెలుగు జాతి ఉన్నంత కాలం టీడీపీ ఉంటుందన్నారు. పార్టీకి తాము వారసులమే, కానీ పెత్తందారులం కాదన్నారు. గతంలో టీడీపీని నాశనం చేసేందుకు ప్రయత్నించిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారని విమర్శించారు. ఆడపడుచులకు, అన్నదాతలకు, సామాన్యులకు అండగా నిలిచిన జెండా పసుపు జెండానే అని వెల్లడించారు.