తెగ వాడేస్తున్నారు.. విద్యుత్ వినియోగంలో హైదరాబాద్​ ఆల్‌టైమ్‌ రికార్డ్

-

ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఒక్క క్షణం ఫ్యాన్, కూలర్ లేకుండా ప్రజలు జీవించలేకపోతున్నారు. ఉదయం 9 నుంచే ఏసీలు ఆన్ చేసేస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోయింది. హైదరాబాద్ లో గురువారం రోజున రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైనట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి తెలిపారు. గత మూడేళ్ల డిమాండ్​తో పోలిస్తే ఈ ఏడాది 16 నుంచి 20 శాతం విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెప్పారు.

గతేడాది మే 19వ తేదీన 3,756 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదు కాగా ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీనే 3,832 గా నమోదయి గతేడాది మే నెల రికార్డును అధిగమించింది. గత మూడేళ్లుగా డిమాండ్ పరిశీలిస్తే ప్రతి ఏటా విద్యుత్ డిమాండ్ పెరిగిపోతుంది. 2024లో మార్చ్​లో 72.02 మిలియన్ యూనిట్లు, ఏప్రిల్​లో నేటి వరకు 78.55 మిలియన్ యూనిట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ సీజన్​లో అంచనాలకు మించి విద్యుత్ వినియోగం డిమాండ్ పెరిగినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగిస్తామని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి ధీమా వ్యక్తంచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version