అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటి అడక్కు’ మూవీ ట్రైలర్ రిలీజ్

-

అల్లరి నరేష్ చాలా గ్యాప్ తరువాత మళ్ళీ ఓ కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ‘ఆ ఒక్కటి అడక్కు’ అంటూ ఓ కామెడీ సినిమాని సిద్ధం చేసారు. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం విడుదలకి సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ ని విడుదల చేసారు.

 

అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ ‘ఆ ఒక్కటి అడక్కు’ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, సాంగ్కు మంచి స్పందన రాగా.. నరేశ్ పంచ్లు, కామెడీ టైమింగ్ సినిమాపై అంచనాలను పెంచాయి. మల్లి అంకం డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రాజీవ్ చిలక నిర్మించగా.. వేసవి కానుకగా మే 3న విడుదల కానుంది.ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వెన్నల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ చిలకా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నాడు

.

Read more RELATED
Recommended to you

Exit mobile version