అల్లరి నరేష్ “నాంది” సినిమాకి భారీ రేటు..

-

అల్లరి నరేష్ హీరోగా వచ్చిన బంగారు బుల్లోడు చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్ ని చవిచూసింది. ఐతే ప్రస్తుతం అల్లరి నరేష్ నుండి మరో కొత్త సినిమా రాబోతుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నాంది అనే సినిమా రూపొందింది. ఈ సినిమా టీజర్ రిలీజై ప్రేక్షకుల నుండి మంచి స్పందన దక్కించుకుంది. అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న నరేష్, తాను తప్పు చేయలేదని ఏ విధంగా నిరూపించుకుంటాడన్నదే కథాంశంగా ఉంది. చాలా రోజుల తర్వాత భిన్నమైన సినిమాతో వస్తున్న నాంది సినిమాపై అందరికీ ఆసక్తి ఉంది.

ఐతే తాజా సమాచారం ప్రకారం నాంది సినిమా హక్కులని జీ స్టూడియోస్ దక్కించుకుందట. ఎనిమిదిన్నర్ కోట్లకి నాంది హోల్ సేల్ హక్కులని జూ స్టూడియోస్ కొనుక్కుందట. అంటే మొదటగా థియేటర్లలో రిలీజ్ చేసి, ఆ తర్వాత ఓటీటీలో అందుబాటులో ఉంచుతారట. ఆ తర్వాత జీ ఛానెల్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తారట. మొత్తానికి అల్లరి నరేష్ నాంది సినిమాతో సరికొత్త సినిమాకి నాంది పలుకుతాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version