మంత్రి కుమారుడిపై లైంగిక దాడి ఆరోపణ.. మహిళపై ఇంక్ దాడి..!!

-

మంత్రి కుమారుడిపై లైంగిక దాడి ఆరోపణలు చేసిన ఓ మహిళలపై కొందరు వ్యక్తులు ఇంక్‌తో దాడి చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. రాజస్థాన్ మంత్రి మహేశ్ జోషి కుమారుడు రోహిత్ జోషి తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఢిల్లీకి చెందిన ఓ మహిళ(23ఏళ్లు) ఆరోపించింది. ఫేస్‌బుక్‌లో పరిచయమై.. పెళ్లి పేరుతో తనను లొంగదీసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మహిళ-ఇంక్ దాడి

ఈ మేరకు ఢిల్లీ పోలీసులు రోహిత్‌ను అరెస్ట్ చేసేందుకు గత నెల రాజస్థాన్ వెళ్లారు. అయితే అక్కడ తను లేకపోవడంతో తిరిగి వచ్చారు. ఢిల్లీ కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన రోహిత్.. శనివారం ఢిల్లీ పోలీసులకు లొంగిపోయాడు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ.. శనివారం దక్షిణ ఢిల్లీలోని కాళింది కుండ్ రోడ్డులో తల్లితో కలిసి వెళ్తుండగా.. ఇద్దరు వ్యక్తులు ఆమెపై ఇంక్‌తో దాడి చేశారు. ఆమె శరీరం, దుస్తువులపై ఇంక్ పోసి పారిపోయారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఇంక్ దాడికి పాల్పడిన నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version