తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండడంతో విద్యాసంస్థలు తెరుచుకోవడం పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సోమవారం నుంచి విద్యా సంస్థలు ఓపెన్ కానుండడంతో పాఠశాలలకు సెలవులు పొడిగింపు ఉంటుందా? అనే చర్చ జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం శుక్రవారం ఒక్క రోజే 155 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో పాఠశాలల ప్రారంభం పై ఆదివారం సాయంత్రం ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడింది.
పాఠశాలలకు సెలవులు పొడిగింపు పై వస్తున్న వార్తలపై విద్యాశాఖ స్పందించింది. పాఠశాలలకు సెలవుల పొడగింపు లేదని స్పష్టం చేసింది. సోమవారం నుండి స్కూల్లు యధావిధిగా ప్రారంభమవుతాయని వెల్లడించింది. విద్యార్థులు, టీచర్లు స్కూళ్లకు హాజరు కావాలని స్పష్టం చేసింది. కాగా ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.