ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ,అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఎన్నికలలో ఎవరు అధికారంలోకి వస్తారని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.కౌంటింగ్ కేంద్రాల్లో కూటమి ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు.
‘లెక్కింపులో అనుమానం వస్తే వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలి అని అన్నారు. అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే వరకు బయటకు రావొద్దు. పోలైన, లెక్కింపులో వచ్చిన ఓట్లను సరిచూసుకోవాలి అని సూచించారు. ఓటమిని తట్టుకోలేక వైసీపీ నేతలు హింసకు పాల్పడే ప్రమాదం ఉంది. కూటమి ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు’ అని టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు చెప్పారు. కాగా, ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఎగ్జిట్ పోల్స్ సర్వేలలో అనుకూలంగా ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే.