మంచు మోహన్ బాబు కుటుంబాన్ని ఇటీవల తరచూ వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. తన కొడుకులు మంచు విష్ణు, మనోజ్ మధ్య ఆస్తి పంపకాల్లో తేడాలు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే జలపల్లిలోని తన ఫాంహౌస్‌లో జరిగిన గొడవలో మోహన్ బాబు కంట్రోల్ తప్పి జర్నలిస్టు మీద మైక్‌తో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.
దీంతో సదరు రిపోర్టర్ తలకు తీవ్రగాయమై ఆస్పత్రిలో చేరాడు. అనంతరం తనపై దాడి చేసిన మోహన్ బాబు మీద హత్యాయత్నం కింద కేసుపెట్టాడు. ఈ కేసులోనే తనకు బెయిల్ ఇవ్వాలని పలుమార్లు మోహన్ బాబు కోర్టుల చుట్టూ తిరిగాడు. చివరకు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా.. పలు వాదనల అనంతరం గురువారం బెయిల్ మంజూరైంది. దీంతో ఆయనకు భారీఊరట లభించింది.