దోస్త్ మొదటి విడత సీట్ల కేటాయింపు : ఎక్కువగా మహిళలకే

-

దోస్త్(డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్) మొదటి విడత సీట్లను కేటాయించింది తెలంగాణ సర్కార్. దోస్త్ పరిధిలో 950 డిగ్రీ కళాశాలలు.. 501 కోర్సులు, 4 లక్షల 8 వేల 345 సీట్లు కేటాయించింది. ఇక 27 డిగ్రీ కళాశాలల్లో జీరో అడ్మిషన్స్ కాగా.. మహిళలకే ఎక్కువ సీట్లు కేటాయించింది. లక్షా 67 వేల 130 మందికి సీట్ల కేటాయింపు చేయగా ఇందులో పురుషులు 78 వేల 21 మంది ఉన్నారు.

అలాగే మహిళలు 89 వేల 109 మంది ఉన్నారు. ఆప్షన్స్ ఎక్కువగా పెట్టుకోక పోవడంతో 14 వేల 508 మంది సీట్లు పొందలేక పోయారు. ఆర్ట్స్ లో 22 వేల 594 మంది… కామర్స్ లో 65 వేల 897 మంది, లైఫ్ సైన్సెస్ లో 33 వేల 17 మంది, డేటా సైన్సెస్ 3 వేల 273 మంది, పిజికల్ సైన్సెస్ లో 35 వేల 731 మందికి సీట్లను కేటాయించింది ప్రభుత్వం. ఇక డిగ్రీ లో కామర్స్ కోర్సునే ఎక్కువ మంది విద్యార్థులు ఎంపిక చేసుకున్నారు. దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు 2లక్షల 6 వేల 44 కాగా.. లక్షా 81 వేల 638 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారు. ఇంగ్లీష్ మీడియం లో లక్ష 47 వేల 36 మంది, తెలుగు మీడియం లో 18 వేల 889 మంది ,ఉర్దూ మీడియం లో 11 వందల 92 మంది, హిందీ మీడియం లో 13 మందికి సీట్లు కేటాయించింది సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news