వాళ్లందరికి న్యాయం జరిగేలా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారు : రాంప్రసాద్ రెడ్డి

-

రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 2 వేల కిలోమీటర్ల పైచిలుకు పాదయాత్ర చేసిన ఘనత నారా లోకేష్ కే దక్కుతుంది. ముందు ఎందరో నాయకులు పాదయాత్రలు చేశారు అవన్నీటిని తలదన్నేలా విధంగా రాష్ట్రంలోని మండలాలు, గ్రామాల్లో పర్యటించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజల కష్టాలను తెలుసుకోవడానికే నారా లోకేష్ దిగ్విజయంగా పాదయాత్ర ను పూర్తి చేశాడు అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.

ఆరోజు పాదయాత్రలో నారా లోకేష్ ప్రజల నుండి తెలుసుకున్న కష్ట, నష్టాలను నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలందరికీ అందిస్తుంది. గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు కష్టాలు పడ్డారు, ఎక్కడ చూసినా దోపిడిలే.. ఆ రోజుకి ఈ రోజుకి మన జీవితాల్లో ఎంతో మార్పులు వచ్చాయి. గత ఐదేళ్లలో కడప, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో వందలాది ఘటనలు జరిగాయి. ఆ ఘటనలలో ఎందరో టిడిపి కార్యకర్తలు అసువులు బాషారు. వాళ్లందరి కుటుంబాలకు న్యాయం జరిగేలా నారా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారు… భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరిగిందంటే కేవలం నారా లోకేష్ వల్లే అని రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news