ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు.. వారికే ఫస్ట్ అవకాశమిస్తామన్న మంత్రి పొన్నం

-

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.ఆదివారం హైదరాబాద్‌‌లోని జీహెచ్ఎంసీ ఆఫీసులో అధికారులు,లోకల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ..కొత్త రేషన్ కార్డుల జారీకి ఈనెల 16 నుంచి 20 వరకు క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుల పరిశీలన ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ఈ నెల 21 నుంచి అర్హులైన వారి వివరాల డేటాను సేకరిస్తామని చెప్పారు. 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా త్వరలోనే దరఖాస్తులు తీసుకుంటామని, హైదరాబాద్‌లో స్థలం ఉండి ఇళ్లు లేని వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని తెలిపారు. నిరుపేదలకు ఇళ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి మహా నగరానికి వలసొచ్చి వారికి కూడా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇస్తామని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news