అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎరువుల ధరలు పెరిగాయి. కానీ ఒక రూపాయి కూడా రైతుల మీద పడకుండా కేంద్రం నిర్ణయం తీసుకుంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. యూరియా 267 రూపాయలకి కేంద్రం ఇస్తుంది.. ప్రతి బస్తకు 2246 రూపాయలు సబ్సిడీ కేంద్రం ఇస్తుంది. ప్రతి DAP బస్తా కు 2422 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. 40 రూపాయలకు బియ్యం కేంద్రం కొని ఫ్రీగా పేదలకు ఇస్తుంది. ఒక ఎకరం మీద 19 వేల రూపాయలు వివిధ మార్గాల ద్వారా కేంద్రం ఇస్తుంది.
అయితే తెలంగాణ రైతులకు కేంద్రం ఎరువుల మీద 33 వేల కోట్లు సబ్సిడీ ఇస్తుంది. విద్యుత్ కోతలు లేని, ఎరువుల కొరత లేని దేశాన్ని మోడీ నిర్మించారు. రైతులకు ఏడాదికి ఇస్తున్న 6 వేల రూపాయలు క్రమం తప్పకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తుంది.. నాలుగు నెలలకోసారి 2 వేల చొప్పున చెక్కులు చూపించి మోసం చేయలేదు. గతంలో దరఖాస్తులు తీసుకున్నారు.. సర్వే చేశారు.. ఇప్పుడు రైతు భరోసా కు మళ్ళీ దరఖాస్తులు ఎందుకు.. కాలయాపన చేసేందుకు ఈ దరఖాస్తులు.. జనవరి రెండో వారం అన్ని జిల్లా కలెక్టర్ లకి, తహసీల్దార్ లకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. బీజేపీ కూడా సాగు చేసే వారికే రైతు భరోసా ఇవ్వమని చెబుతుంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో ఏమీ చెప్పింది అది అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కిసాన్ సమ్మాన్ నిది 6 వేల నుండి 10 వేలకు పెంచినప్పుడు చెబుతాం అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.