Pushpa Trailer : అల్లు అర్జున్ భ‌యం లేని హీరో.. ప్ర‌శంస‌లు కురిపించిన ఆర్జీవీ

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌శంసలు కురిపించాడు. నిన్న రాత్రి విడుద‌ల అయిన అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 ట్రైల‌ర్ విడుద‌ల అయిన విష‌యం తెలిసిందే. ఈ ట్రైల‌ర్ లో ఐకాన్ స్టార్ రియ‌లిస్టిక్ లుక్ లు కేక పుట్టించేలా ఉన్నాడు. అయితే ఈ ట్రైల‌ర్ పై ట్విట్ట‌ర్ వేదిక గా ఆర్జీవీ స్పందించాడు. టాలీవుడ్ లో భ‌యం లో ని హీరో అంటే అల్లు అర్జునే అని అన్నారు.

పుష్ప లాంటి పాత్రలు ఎవ‌రూ కూడా చేయ‌లేర‌ని అన్నారు. రియ‌లిస్టిక్ పాత్ర‌లు చేయ‌డానికి అల్లు అర్జున్ త‌ప్ప ఎవ‌రూ చేయ‌లేరిన అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్, చిరంజీవి, ర‌జినీకాంత్, మ‌హేష్ బాబు లు కూడా ఇలాంటి పాత్ర‌లు చేయ‌లేర‌ని వారిని ట్యాగ్ చేస్తూ చెప్పాడు. అంతే కాకుండా ఇలాంటి పాత్ర‌లు చేయ‌గాలారా అని స‌వాల్ విసిరాడు. అలాగే చివ‌రి గా పుష్ఫ అంటే ఫ్ల‌వ‌ర్ కాదు.. ఫైర్ అంటూ ట్రైల‌ర్ లోని డైలాగ్ రాశాడు.

Read more RELATED
Recommended to you

Latest news