అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చడం కరెక్ట్ కాదు అన్నారు డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. “తన వల్లే ఒకరు చనిపోయారు అనే వేదన అర్జున్ లో ఉంది. సినిమా అంటే టీమ్, అందరి భాగస్వామ్యం. అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చడం కరెక్ట్ కాదు.” అంటూ తెలిపారు డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
అల్లు అర్జున్ తరపున ఎవరొకరు బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉంటే బావుండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచివేసిందన్నారు. రేవంత్ రెడ్డి బలమైన నేత అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్నా అలానే అరెస్టు చేస్తారు, చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు. రేవంత్ రెడ్డి తెలుగు పరిశ్రమకు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారు అని అల్లు అర్జున్ ఇష్యూపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సంధ్య థియేటర్ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.