భారత ప్రధాని గా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే విప్లవాత్మక భూసేకరణ చట్టం వచ్చిందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా శాసనసభలో ఆయన మాట్లాడారు. దేశ క్షేమం దృష్ట్యా మన్మోహన్ సింగ్ న్యూక్లియర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన తొలి ప్రధాని మన్మోహన్ సింగ్ అని గుర్తు చేశారు. సోనియగాంధీ సూచనల మేరకు ఆయన గొప్ప చట్టాలు తెచ్చారు.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది. ప్రభుత్వంలో ఉన్నవారు జవాబుదారిగా ఉండాలని సమాచార హక్కు చట్టం తీసుకొచ్చారు. ప్రజల సొమ్ముతో చేసిన పనుల వివరాలు తెలుసుకొనే హక్కు దీని ద్వారా లభించింది. ఆకలి చావులు ఉండకూడదని ఆహార భద్రత చట్టం తెచ్చారని వెల్లడించారు మంత్రి ఉత్తమ్. దేశాభివృద్ధికి మన్మోహన్ సింగ్ చాలా గొప్ప విధానాలను తీసుకొచ్చారని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేసుకున్నారు. ఆయన సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారని కొనియాడారు.