ఆ స్టార్ దర్శకత్వం లో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ..!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలుతో నటిస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఆయన సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న పుష్ప టు సినిమాలో నటిస్తున్నారు. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తోంది. పుష్ప టు తర్వాత ఇంకో రెండు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ బర్త్ డే కావడంతో మేకర్స్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసి ఫాన్స్ ని సర్ప్రైజ్ చేశారు నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతుంది. హారిక క్రియేషన్స్ నిర్మాణంలో ఈ మూవీ తెరమీదకి రాబోతుంది. ఇటీవల ఇప్పటికే బన్నీ త్రివిక్రమ్ హారిక క్రియేషన్స్ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ అవ్వబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news