సహజీవనం తర్వాతే పెళ్లి చేసుకుంటా – అల్లు శిరీష్

-

 

సహజీవనం తర్వాతే పెళ్లి చేసుకుంటానని కామెంట్స్‌ చేశారు అల్లు శిరీష్. అల్లు శిరీష్ కు టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకునేందుకు ఎంతో కష్టపడుతున్నాడు. మెగా మేనల్లుడిగా అల్లు వారి అబ్బాయి గా టాలీవుడ్ హీరో గా ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. మెగా బ్యాక్ గ్రౌండ్… మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తమ్ముడిగా ఉన్న అల్లు శిరీష్‌కు మాత్రం ఒడిదుడుకులు తప్పడం లేదు.

ఇక శిరీష్‌ చేసిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం మంచి విజయం సాధించింది. దీంతో నిన్న ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం సక్సెస్‌ మీట్‌ జరిగింది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రంలోని ముద్దు దృశ్యాల్ని సెన్స్ తో తెరకెక్కించామని, ఎక్కడ హద్దులు దాటలేదని హీరో అల్లు శిరీష్ తెలిపాడు. ఈ సినిమాలో ప్రేమ, సహజీవనం, పెళ్లి అంశాల్ని చర్చించామన్నాడు. వివాహ వ్యవస్థ పై తనకు బలమైన విశ్వాసం ఉందని చెప్పాడు. సహజీవనం తర్వాత పెళ్లాడితే బాగుంటుందనేది తన అభిప్రాయం అన్నాడు. తన పెళ్లి విషయంలో ఇంట్లో ఏమాత్రం ఒత్తిడి చేయడం లేదని పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version