మెగాస్టార్ చిరు వల్ల నష్టపోయిన అల్లుఅర్జున్… ఎలా అంటే?

-

తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, ఇతర ఇండస్ట్రీల్లోనూ నటులు అయిన వారు, అవుదామనుకునేవారు అగ్ర కథానాయకుడు చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుంటారు. ముఖ్యంగా ఆయన డ్యాన్స్‌, ఫైట్స్‌కు ప్రత్యేకంగా అభిమానులే ఉన్నారు. వెండితెరపై చిరు స్టెప్‌లేస్తుంటే ఆ గ్రేస్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. తెరపై వందల మంది డ్యాన్సర్లు, అందమైన కథానాయిక ఉన్నా, ప్రతి ప్రేక్షకుడి చూపు చిరు వేసే స్టెప్‌పైనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితే స్టార్‌ హీరో అల్లు అర్జున్‌కు ఎదురైందట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో చెబుతూ చిరు వల్ల రూ.25వేలు నష్టపోయినట్లు చెప్పారు.

అల్లు అర్జున్

‘‘చిరంజీవిగారి వల్ల జీవితంలో ఒకే ఒకసారి నష్టపోయా. పాతికవేలు పోగొట్టుకున్నా. ‘ఇంద్ర’ సినిమా విడుదలైన సమయంలో నాకూ నా స్నేహితుడికి మధ్య చర్చ జరిగింది. ముఖ్యంగా చిరంజీవిగారు వేసిన వీణ స్టెప్‌ గురించి ఇద్దరం మాట్లాడుకున్నాం. వీణ స్టెప్‌ వేసేటప్పుడు ‘చిరంజీవిగారి పక్కన సోనాలిబింద్రే ఉంద’ని నా స్నేహితుడు వాదించాడు. ‘లేదు నేను ఆ సినిమా 17సార్లు చూశా. చిరు సోలో స్టెప్‌ వేశారు’ అని గట్టిగా వాదించా. దీంతో రూ.25వేలు పందెం కట్టా. ఆఖరికి వీడియో చూస్తే, సోనాలిబింద్రే ఉంది. అంటే అప్పటివరకూ నేను కేవలం బ్లాక్‌ ప్యాంట్‌, రెడ్‌ షర్ట్‌ వేసుకుని వీణ స్టెప్‌ వేస్తున్న చిరంజీవిగారిని మాత్రమే చూశా. పక్కన ఉన్న సోనాలి బింద్రేను గుర్తించలేకపోయా’’ అంటూ ఆ నాటి సంగతిని పంచుకున్నారు అల్లు అర్జున్‌.

అల్లు అర్జున్

Read more RELATED
Recommended to you

Exit mobile version