విధుల్లో చేరిన మరుసటి రోజే వర్మ తొలగింపు..

-

సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్‌ వర్మను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు తీర్పుతో  విధుల్లో చేరిన ఆయన్ను మోడీ నేతృత్వంలోని కమిటీ తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ప్రధాని కార్యాలయంలో సుమారు రెండు గంటల పాటు సమావేశం జరిగిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలోక్‌ తొలగింపునకు మోడీ, జస్టిస్‌ సిక్రీ మొగ్గు చూపగా.. ఖర్గే మాత్రం వ్యతిరేకించారు. అయితే వర్మను ఎన్‌హెచ్‌ఆర్‌సీకి బదిలీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సీవీసీ నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్మ తొలగింపునకు కొన్ని గంటల ముందు ఐదుగురు సీబీఐ ఉన్నతాధికారులను బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.

ఆలోక్‌ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో వారిద్దరి అధికారాలను వెనక్కి తీసుకొని, వారిని బలవంతపు సెలవుపై పంపుతూ సీవీసీ, కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 23న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వాన్ని వర్మ విషయంలో సుప్రీం తీవ్రంగా తప్పు బట్టిన నేపథ్యంలో గురువారం ప్రధాని తీసుకున్న నిర్ణయంతో  సీబీఐ వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version