భారత దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణాంతరం ఆయన దేశానికి అందించిన సేవలకు గుర్తుగా రాష్ట్రంలో స్మారక చిహ్నం ఏర్పాటుతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఒకదానికి ఆయన పేరు పెట్టే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్‌కు సభలో సంతాప తీర్మాణం ప్రవేశపెట్టిన అనంతరం సీఎం మరోసారి దీని గురించి ప్రస్తావించారు.
ఈ క్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మన్మోహన్ సింగ్ స్మారకచిహ్నంతో పాటు తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు స్మారక చిహ్నం కూడా ఏర్పాటు చేయాలని ఆయన సభా వేదికగా ప్రభుత్వాన్ని కోరారు.