మణిరత్నం ఆఫర్‌కు నో చెప్పిన అమలాపాల్‌.. కారణమిదే!

-

మణిరత్నం పిలిచి మరీ అవకాశం ఇస్తానంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. తమ కెరీర్‌లో ఒక్కసారైనా ఆయన చిత్రంలో నటించాలని ఆశిస్తారు. పాత్ర చిన్నదా? పెద్దదా? అన్నది అస్సలు ఆలోచించరు. కానీ, అమలపాల్‌ మాత్రం మణిరత్నం చిత్రంలో చేయనని చెప్పిందట. అందుకు తానేమీ బాధపడటం లేదని కూడా చెప్పటం విశేషం. ఆయన దర్శకత్వంలో విక్రమ్‌, కార్తి, జయంరవి కీలకపాత్రల్లో రూపొందిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. సెప్టెంబరు 30న ఈ చిత్రం విడుదల కానుంది.

ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమలపాల్‌ మాట్లాడుతూ.. మణి సర్‌కు నేను పెద్ద అభిమానిని. ఆయన నన్ను పిలవగానే చాలా ఉత్సాహంగా అనిపించింది. మొదటిసారి ఆడిషన్‌ చేసిన తర్వాత ఆయన అనుకున్న పాత్రకు నప్పలేదు. నాకు చాలా బాధగా అనిపించింది. ఆ తర్వాత 2021లో అదే ప్రాజెక్టు కోసం మళ్లీ నన్ను పిలిచారు. అయితే, తాను ఆ పాత్ర చేసే మానసిక స్థితిలో లేనని చెప్పా. అందుకే ఆ అవకాశాన్ని వదులుకున్నా. ‘మీరు ఆ పాత్ర చేయనందుకు విచారం వ్యక్తం చేస్తున్నారా’ అని నన్ను ప్రశ్నిస్తే, కచ్చితంగా కాదని చెబుతా. ఎందుకంటే కొన్ని విషయాలు అంతే… అని చెప్పుకొచ్చింది.

పీరియాడిక్‌ డ్రామాగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ రూపొందింది. విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version