ఏదో అనుకుంటే ఏదో జరిగింది .. అమరావతి ని చూసి నవ్వుతోంది ఎవరు ?

-

ఇంగ్లీష్ మీడియం మరియు ఇసుక విధానం లో అధికార పార్టీని ఇరుకున పెట్టాలని తెలుగుదేశం పార్టీ అప్పట్లో అనేక కుయుక్తులు వేసింది. అయినా ఎక్కడా కూడా పని కాలేదు. ఎప్పుడైతే జగన్ మూడు రాజధానులు అనే నిర్ణయం ప్రకటించడం జరిగింది. వెంటనే టీడీపీ అమరావతి రైతులను అడ్డం పెట్టుకుని వైయస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లే విధంగా కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. ఒకపక్క అమరావతిలో రాజధాని ప్రాంత రైతులకు అండగా ఉంటూ నిరసనలు, ఆందోళనలు చేస్తూ మరోపక్క వైయస్ జగన్ ప్రభుత్వానికి అంతర్జాతీయస్థాయిలో మచ్చ తీసుకురావాలని ఇటీవల వేసిన ప్లాన్ నవ్వుల పాలైంది.

మేటర్ లోకి వెళ్తే అమెరికాలో స్థిరపడిన ఓ ప్రవాస భారతీయుడు టీడీపీ కి మద్దతుగా ఉండే వ్యక్తి చేత…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కులకు అమరావతిలో భంగం కలుగుతుందని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దీంతో ఆ పిటిషన్ నీ స్వీకరించిన అంతర్జాతీయ న్యాయస్థానం, దానిని ఒక లెటర్ గానే భావించడంతో ఒక్కసారిగా టిడిపికి మైండ్ బ్లాక్ అయింది.

 

మరోపక్క ఈ లెటర్ ని ఏదో పెద్ద విజయంగా టీడీపీకి మద్దతు గా ఉండే మీడియా ఇటీవల కథనాలు ప్రసారం చేసింది. కానీ అంతర్జాతీయ న్యాయస్థానం ఒక లెటర్ గానే పిటిషన్ని స్వీకరించడంతో ఏదో అనుకుంటే ఏదో జరిగి అన్నట్టు మారిపోయింది అమరావతి పరిస్థితి. దీంతో అమరావతిని అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయాలనుకుంటున్న టిడిపి పార్టీ అంతర్జాతీయ స్థాయిలో నవ్వుల పాలైనట్లు పరిస్థితి మారింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version