మహేష్ బాబు ఇలా చేయడం కరెక్టేనా ..?

-

ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక రేంజ్ ఉన్న హీరోలు మహేష్ బాబు, ప్రభాస్. వీళ్ళిద్దరి రెమ్యూనరేషనే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. మహేష్ బాబు సినిమాకు రెమ్యూనరేషన్, ఇతర షేరింగ్ .. అన్నీ కలిపి 150 కోట్ల వరకు మార్కెట్ వుంది. అయితే మహేష్ బాబు ఈ విషయంలో ప్రత్యామ్నయం ఆలోచించాలి. ఆయన రెమ్యూనరేషన్ లో సడలింపు ఉండాలి. తన రెమ్యూనిరేషన్, ప్రొడక్షన్ అన్నీ కలిసి 80 కోట్లలో కంప్లీటయితే 100 కోట్ల వరకు మార్కెట్ చేస్తే, మహేష్ బాబు సినిమాల్లో కమర్షియల్ ఫ్లాపులు అన్నవి ఉండవు. ఎందుకంటే ఫ్లాప్ అయినా హిట్ అయినా 60 నుంచి 70 కోట్ల రేంజ్ కలెక్షన్లు సాధించే కెపాసిటీ గాని, స్టామినా గాని మహేష్ బాబు కి ఉంది.

 

అందుకే మహేష్ బాబు కాస్త రెమ్యూనరేషన్ తక్కువ తీసుకుని బయ్యర్లకు లాభం వుండేలా, నిర్మాతకు లాభం వుండేలా మార్కెట్ స్ట్రాటజీ డిజైన్ చేసుకుంటే సూపర్ స్టార్ సినిమాలకి భారీగా లాభాలొస్తాయి. అల్లు అర్జున్ 24 కోట్లు ప్లస్ లాభాల్లో వాటా, ఎన్టీఆర్ 30 కోట్లు లాభాల్లో వాటాగా తీసుకుంటుంటే మహేష్ బాబు మాత్రం యాభై కోట్లు లాభాల్లో వాటా తీసుకుంటే పరిస్థితి చాలా కష్టం కదా. ఈ విషయంలోనే దిల్ రాజు ప్రాజెక్ట్ ని కూడా పక్కన పెట్టినట్టు సమాచారం.

 

ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణకు నిర్మాతల హీరో అనే పేరు వుండేది. ఆ రోజుల్లో ఆయనతోనే నిర్మాతలు వుండేవారు. వారి కష్ట, నష్టాలను ఆయన పట్టించుకుంటూ అన్ని విధాలా ఆదుకునేవారు. ఒక సినిమా గనక ఫ్లాపయితే అదే నిర్మాతకి రెమ్యూనరేషన్ తీసుకోకుండా వెంటనే మరో సినిమాకి డేట్స్ ఇచ్చేసేవారు. కాని మహేష్ బాబు కృష్ణ గారిని ఈ విషయంలో ఫాలో కావడం లేదు. నిజంగా ఆయనని గనక ఫాలో అయితే ఇంకా బోలెడన్ని ఎక్స్‌పరిమెంట్స్ అలాగే సంవత్సరానికి 2-3 సినిమాలు చేసే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version