ఓవైపు ఏపీ రాజధానిగా ఏ ప్రాంతాన్ని ఎంపిక చెయ్యాలనే అంశంపై, జీఎన్ రావు కమిటీపై ఏపీ కేబినెట్ చర్చిస్తుంటే… మరోవైపు అమరావతిలో రైతులు భగ్గుమంటున్నారు. పదో రోజు ఆందోళనలను మరింత ఉద్ధృతం చేశారు. ఈ నేపథ్యంలోనే అమరావతిలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న రైతులు మీడియాపై దాడికి దిగారు. ఉద్దండరాయునిపాలెంలోని ప్రధాని మోదీ శంకుస్థాపన ప్రదేశంలో ముగ్గురు మీడియా ప్రతినిధులపై రైతులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు మీడియా మిత్రులకు తీవ్ర గాయాలయ్యాయి.
రైతులకు వ్యతిరేకంగా రెండు చానల్స్‌లో వార్తలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముగ్గురు మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. మేము పెయిడ్ ఆర్టిస్టులమా..? అంటూ మీడియాపై రైతులు మండిపడుతున్నారు. అయితే.. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించడం గమనార్హం.